విజయవాడకు చెందిన బాలిక(14), బాలుడు (13) ఇంటి నుంచి పారిపోవడంపై నెటిజన్లు షాకవుతున్నారు. అంతచిన్న వయసులో ఇలాంటి ఆలోచన, ధైర్యం రావడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియా వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. బుధవారం బాలుడు తన తండ్రి ఫోన్, రూ. 10వేలు తీసుకుని అమ్మాయితో హైదరాబాద్ వచ్చాడు. తుక్కుగూడలో రూమ్ కోసం వెతుకుతుండగా ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పేరెంట్సు అప్పగించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.