శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామ సమీప సముద్ర తీరానికి భారీ తిమింగళం శుక్రవారం ఉదయం కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే... గమనించిన స్థానిక మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ అధికారి మురళీకృష్ణ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని తిమింగళం కు పోస్టుమార్టం నిర్వహించి సమీప ప్రాంతంలో ఖననం చేశారు. ఆరున్నర మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో సుమారు రెండు టన్నుల బరువు ఉంటుందని ఆయన తెలిపారు. సముద్రం లోపల ప్రయాణించే భారీ పడవలు, వాడలు తగలడంతో ఇలా మృత్యువాత పడతాయని ఆయన తెలిపారు.
పలాస కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా విభజించి పలాస కేంద్రంగా జిల్లా నాయకులు ప్రకటించాలని కోరారు. ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా పోరాడుతాం అని ఆయన ప్రకటించారు. ఆయన పిలుపుమేరకు పలు ప్రజాసంఘ నాయకులు, మేధావులు, ఉద్యోగులు, యువకులు పాల్గొన్నారు.