శ్రీకాకుళం....
పలాసలో నేడు జరగనున్న మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స.
పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో నేడు మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విశాఖకు చెందిన వైద్య బృందం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సుమారు రూ. 12 కోట్ల నిధులతో అత్యాధునిక పరికరాలతో పాటు, అర్హత కలిగిన వైద్యులను నియమించారు. దీంతో సోంపేట పట్టణానికి చెందిన యువతి హేమశ్రీ కి మొదటి కిడ్నీ మార్పిడి చికిత్స నేడు జరుగుతుందని ఎమ్మెల్యే శిరీష తెలిపారు.