ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు లో భాగంగా శుక్రవారం పలాస మండలం రాజగోపాలపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ భూ సమస్యలను వినతుల రూపంలో అందించారు. సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డిఓ అప్పలరాజు, డిడిఓ రమేష్ నాయుడు, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎండిఓ వసంత్ కుమార్, ఎంఈఓ శ్రీనివాస్ రావు, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, నేటి సంఘ అధ్యక్షులు గోనప నిరంజన్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.