శ్రీకాకుళం జిల్లా మందస మండలం మూలిపాడు గ్రామంలో రూ. 27 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం పల్లె పండగ ద్వారా రోడ్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు. అనంతరం ఎంపీ లాడ్స్ రూ. 4 లక్షలతో నిర్మించిన పెద్ద చెరువు మెట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...