శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బద్రి సీతమ్మ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తరపున చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందిస్తానని, నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మరోవైపు వీధుల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తూ... ఈనెల 28న జరగబోయే పోలింగ్ లో హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.