స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల పరిధి కూటమి ఎంపీపీ అభ్యర్థిగా శ్రీమతి పుచ్చ శోభారాణి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెండున్నర ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి నన్ను ఆశీర్వదించండి అని కోరారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే శిరీష సహకారంతో వజ్రపుకొత్తూరు మండల పరిధిలో ఉన్న గ్రామాలలో మౌలిక వసతులు సమకూరుస్తూ.. మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుచ్చ ఈశ్వర్రావు, కర్ని రమణతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.