పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ అన్ రిజర్వుడ్ మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.. వైకాపా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. పలాస కు చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ సతీష్ భార్య తలాసు శ్రీపద్మ(కలింగవైశ్య) పేరును వైకాపా పలాస చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు అధికార పార్టీ నేటికీ తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.