Skip to main content

Posts

Showing posts from April, 2026

కాశీబుగ్గలో పదో తరగతి టాపర్ కీర్తి పండా..

కాశీబుగ్గ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుతున్న కీర్తి ఈరోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని LMR NEWS తో మాట్లాడుతూ... నేను ఈ విజయం సాధించడానికి నన్ను వెన్నుదన్నుగా ఉన్న లెక్కల మాస్టర్ (వెంకట్రావు) సార్ ప్రధాన కారణమని ఆమె తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడిందని, పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో ఈ మార్కులు సాధించానని తెలిపారు. కూతురు విజయాన్ని తల్లి శివాని పండా కూడా ఆనందం వ్యక్తపరిచారు

చెరువులో పల్టీలు కొట్టిన ఆటో.. ఐదుగురికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అల్లుకోల గ్రామ సమీప చెరువు(హరి సాగరం)లో గురువారం ప్రయాణికులతో వెళుతున్న ఆటో అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. 9మంది ప్రయాణికులతో పలాస వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విలేకరిని హత్య చేసిన నిందితుడును కఠినంగా శిక్షించాలని పలాసలో నిరసన

విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసన -నిందితులను కఠినంగా  శిక్షించాలి  కాశీబుగ్గ డిఎస్పికి వినతిపత్రం అందించిన పలాస జర్నలిస్టులు చిత్తూరు జిల్లా వి.కోట మండల ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ మంగళవారం ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలాస నియోజకవర్గం జర్నలిస్ట్ లు కాశీబుగ్గ మున్సిపాలిటీలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా దుండగులు విలేకరిని కత్తులతో దాడి చేసి అత్యంత హేయంగా చంపడాన్ని ఏపీయుడబ్ల్యూజే  పలాస ప్రెస్ క్లబ్ లు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తీవ్రంగా ఖండించారు.  శ్రీగంధం చెట్ల అక్రమ రవాణాపై వార్తలు రాసినందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని జర్నలిస్టులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాశీబుగ్గ  లో మాహాత్మ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన అనంతరం,  కాశిబుగ్గ డిఎస్పి  టి భవాని కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు డి మహరణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సిహెచ్ జగదీష్ మాట్లాడుతూ చేయడం దారుణం అన్నారు హత్య చేసిన వారిని కూటమి ప్రభుత్వ...

పెద్ద నారాయణపురంలో ఉపాధి పనులను ప్రారంభించిన గోపాలరావు.

పలాస మండలం బంటుకొత్తూరు పంచాయతీ పెద్ద నారాయణపురం గ్రామంలో పెద్ద చెరువు లో ఉపాధి హామీ పథకం పనులను  తెలుగుదేశం నాయకులు నిమ్మన గోపాలరావు ప్రారంభించారు. మంగళవారం ఉదయమే భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ గుంట హారతి, కార్యకర్తలు, ఉపాధి హామీ శ్రామికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

సముద్రపు నాచు తయారీ పై అవగాహన కల్పించిన పరిశోధకులు

సముద్ర తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల జీవన ఆర్థిక అభివృద్ధి పెంపొందించేందుకు, సముద్రపు నాచు తయారీ పై పలాస నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో చెన్నై కి చెందిన పరిశోధకులతో కలిసి సోమవారం వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేట తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా... స్థానిక మత్స్యకారులకు సముద్రపు నాచు తయారీ విధానం, సేకరించిన నాచును ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

మందస నుంచి పాతకోటకు ఆర్టీసీ బస్సు ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా మందస మండల గిరిజన ప్రాంత ప్రజల కోరిక మేరకు పలాస ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మందస నుంచి పాతకోట కు ఆర్టీసీ బస్సు సర్వీస్ ను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గిరిజన ప్రాంత ప్రజలు తమ అవసరాలకు మందస రావాలంటే టక్కర్లు, ఆటోల పై ప్రమాదక ప్రయాణాలు చేసేవారని తెలిపారు. ఈ బస్సు సౌకర్యం వలన ఇక ప్రమాదక ప్రయాణాలు గిరిజనులకు తప్పాయన్నారు. ముఖ్యంగా మహిళలు మహిళా శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

దళిత వాడకు దాహం తీర్చిన కూటమి నేత

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెద్ద నారాయణ పురం ఎస్సీ కాలనీలో కొన్నాళ్ల క్రితం చేతి పంపు పాడైంది. వేసవి సమీపిస్తున్న వేళ స్థానిక ప్రజలు త్రాగునీరుకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించిన స్థానిక తెలుగుదేశం నాయకుడు నిమ్మన గోపాల్ దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి.... చేతి పంపును బుధవారం బాగు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు తల్లి కూతురు మృతి

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెద్ద కేసుపురం గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు గురై తల్లి కూతురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మడియా కృష్ణవేణి(35), తన కుమార్తె చిన్ని(15) కలిసి జీడీ తోటలో పనులు చేస్తుండగా... ఒకసారిగా పిడుగు పడటంతో తల్లి కూతురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నూతనంగా నిర్మించిన పిఎం జన్మన్ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష.

శ్రీకాకుళం జిల్లా మందస మండల పరిధి గిరిజన ప్రాంతమైన డబార్షింగి గ్రామంలో రూ. 2.30 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన పిఎం జన్మన్ పాఠశాలను ఆదివారం ఎమ్మెల్యే శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మారుమూల గిరిజన ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు విద్య, పౌష్టికాహారాన్ని అందించేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

పలాసలో ఘనంగా నిర్వహించిన జగ్జీవన్ జయంతి వేడుకలు

జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణంలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గౌతు శిరీష పూలమాల లేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... బీహార్ లో జన్మించిన బాబు జగ్జీవన్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడని, భారత రాజ్యాంగ నిర్మతలలో ఒకరైన జగ్జీవన్ దళిత నాయకుడని కొనియాడారు. సుమారు 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలందించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

పలాసలోని పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

రోజురోజుకు ఎండ తీవ్రత పెరగడంతో శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అక్కుపల్లి జంక్షన్, కాశీబుగ్గ బస్టాండ్, నెహ్రూ పార్క్ ల వద్ద చలివేంద్రాలను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జంట పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.