Skip to main content

విలేకరిని హత్య చేసిన నిందితుడును కఠినంగా శిక్షించాలని పలాసలో నిరసన

విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసన

-నిందితులను కఠినంగా  శిక్షించాలి 

కాశీబుగ్గ డిఎస్పికి వినతిపత్రం అందించిన పలాస జర్నలిస్టులు

చిత్తూరు జిల్లా వి.కోట మండల ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ మంగళవారం ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలాస నియోజకవర్గం జర్నలిస్ట్ లు కాశీబుగ్గ మున్సిపాలిటీలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా దుండగులు విలేకరిని కత్తులతో దాడి చేసి అత్యంత హేయంగా చంపడాన్ని ఏపీయుడబ్ల్యూజే  పలాస ప్రెస్ క్లబ్ లు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తీవ్రంగా ఖండించారు. 
శ్రీగంధం చెట్ల అక్రమ రవాణాపై వార్తలు రాసినందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని జర్నలిస్టులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాశీబుగ్గ  లో మాహాత్మ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన అనంతరం,  కాశిబుగ్గ డిఎస్పి  టి భవాని కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు డి మహరణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సిహెచ్ జగదీష్ మాట్లాడుతూ చేయడం దారుణం అన్నారు హత్య చేసిన వారిని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు, రాష్ట్రంలో జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. మృతుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని చంపిన నిందితులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యకమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా విలేకరులు హరి నారాయణ, అశోకు నారాయణ నాని భుజంగరావు నేతాజీ జయంత్ చిట్టి భీమారావు రవి చందన్ రావు మోహన్ భాస్కరరావు అంజి రూప్ సుందర్ సత్యం కుమార్ మేఘన కృష్ణ రమేష్ రవీంద్ర రవి తదితరులు పాల్గొన్నారు.

High Viewed News

పూండిలో కలకలం రేపిన బంగారం చోరీ...

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.

పలాసలో రైలు నుంచి జారిపడిన మహిళకు తీవ్ర గాయాలు

కలకత్తా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) రైలులో ప్రయాణం చేస్తూ... ఆదివారం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ జారిపడింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సత్యం & వెంకట్రావు ఘటన స్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స అందించి, వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ అస్సాం కు చెందిన అజ్వినా ఖాన్ గా గుర్తించి కేసు నమోదు చేసిన పలాస జిఆర్పి పోలీసులు.

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

SIR విధులకు అదనపు వేతనం ఇవ్వాలని వినతి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు అదనపు గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావుకు ఆదివారం కంప్యూటర్ ఆపరేటర్లు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. SIR విధుల్లో భాగంగా అదనపు పనిభారం, సాంకేతిక మరియు ఇతర కార్యనిర్వహణ సమస్యలు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. అదనంగా నిర్వహిస్తున్న విధులను పరిగణనలోకి తీసుకుని అదనపు గౌరవ వేతనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు సానుకూలంగా స్పందిస్తూ... తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సిమ్మన్న, హరి, కోదండ, సుధాకర్ తదితర ఎన్నికల కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

పలాస ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే శిరీష

పలాస సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాజరు పట్టిని పరిశీలించి డ్యూటీలో ఉన్న డాక్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సమయపాలన పాటించి వచ్చిన రోగులకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఇటీవల పలువురు వైద్యులపై రోగుల నుంచి ఫిర్యాదులు అందాయని అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.