Skip to main content

Posts

Showing posts from June, 2026

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి..! వెంకన్న చౌదరి పిలుపు

శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయంలో మంగళవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి ముఖ్య నాయకులతో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న మున్సిపల్ ఎన్నికలకు అంత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

ఇద్దరు చిన్నారులను గొంతు కోసి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్ళవలస గ్రామంలో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కూర్మాపు వరలక్ష్మి (30), తన ఇద్దరు కుమార్తెలు భవాని(3), చాందిని 4 నెలలు గొంతు కోసి, అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటనా స్థలంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా... తల్లి రిమ్స్ ఆసుపత్రిలో కొనఊపిరితో పోరాడుతుంది. విషయం తెలుసుకున్న డి.ఎస్.పి ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన తల్లి మాట్లాడితే పూర్తి వివరాలు తెలుస్తాయని, ఆయన మీడియాతో వెల్లడించారు.

రాకాసి అలలకు ఇద్దరు బీటెక్ విద్యార్థులు బలి..!

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్రతీరంలో ఇద్దరు విద్యార్థులు రాకాసి అలలకు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు ఒక మృతదేహం భావనపాడు తీరానికి చేరుకోగా... మరో మృతదేహం వజ్రపు కొత్తూరు మండలం అల్తాడా తీరానికి కొట్టుకొచ్చింది. మృతులు టెక్కలి ఐతమ్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా స్థానికులు గుర్తించారు. గోరువంకల అగస్త్య (19) బీటెక్ (it), విజయనగరం జిల్లా మెరకముడదాం కు చెందిన సారపెంట యశ్వంత్(18-CEC)గా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళ కూలీలు మృతి

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేధారపుట్టుగ గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందగా.. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కంచిలి మండల పరిధిలో జరిగిన ఆదివారం సంత నుంచి పనస కాయలు లగేజీ ఆటోలో ఇచ్చాపురం వైపు తరలిస్తుండగా... లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు కవిటి మండలం రాపాకపుట్టుగ గ్రామానికి చెందిన నర్తు పద్మ(50), గుజ్జుపుట్టుగ గ్రామానికి చెందిన మురపాల భారతి (55), ఇచ్చాపురం ఏఎస్ పేటకు చెందిన మద్దిలి తరినమ్మ (58) గా గుర్తించినట్లు కవిటి ఎస్సై రవికిరణ్ తెలిపారు.

నారీ శక్తిపై అవగాహన కల్పించిన ఎస్సై పారినాయుడు

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కొల్లూరులో శుక్రవారం ఎస్సై పారినాయుడు  ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.

డ్రగ్స్ వద్దు బ్రో అంటూ... ప్రతిజ్ఞ చేయించిన కాశీబుగ్గ పోలీసులు

నశా ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు మాజీ సైనికులు కళాశాల విద్యార్థులతో కలిసి కాశిబుగ్గ శ్రీనివాసా లాడ్జ్ జంక్షన్ నుంచి పలాస ఇందిరా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐ రామకృష్ణ మాట్లాడుతూ... యువత దేశాభివృద్ధికి వెన్నుముక లాంటి వారిని, అటువంటి యువత డ్రగ్స్ జోలికి పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. అనంతరం జీవితంలో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ సిఐలు రామకృష్ణ, తిరుపతిరావు, ఎస్సైలు సునీల్, నరసింహమూర్తి సిబ్బంది, సప్ప నవీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు

అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపిన పలాస తాసిల్దార్ శ్రీదేవి.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరభద్రాపురంలో ప్రభుత్వ కాలువ, గోర్జి భూమిని ఆక్రమించి నిర్మాణం చేపడుతుండగా తహశీల్దార్ శ్రీదేవి రెవెన్యూ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకపోవడంతో గురువారం రాత్రి పనులను నిలిపివేసి అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొనగా, కాశీబుగ్గ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహశీల్దార్ హెచ్చరించారు.

రామగిరి పై రాములోరి ఉత్సవాలు చూద్దాం రారండోయ్..!

శ్రీకాకుళం జిల్లా పలాస (M) కైజోల గ్రామానికి ఆనుకుని ఉన్న రామగిరి పై నేటి నుంచి మూడు రోజులు పాటు జరుగుతున్న శ్రీ కోదండరామ ఆలయ ప్రతిష్ట మహోత్సవాల్లో గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురాగా... వందలాదిమంది మహిళలు పూర్ణకలశాలతో స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న సుమారు 50 మంది యువకులు హనుమాన్ మాల ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు మూడు పూట్ల ఉచిత అన్న వితరణ కార్యక్రమం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్సై నరసింహమూర్తి తో పాటు సిబ్బంది పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి శ్రీనివాస నగర్ లో గురువారం ఉదయం తన ఇంటి సమీప ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు గుంపుగా దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో బాలుడు కాళ్లు తొడ భాగం నుంచి పాదం వరకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరమడంతో బాలుడును ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన బాలుడు చికిత్స నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుంచి చిన్నారులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

మూఢనమ్మకాలపై అవగాహన కల్పించిన సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు గ్రామంలో బుధవారం కాశీబుగ్గ సీఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి మూఢనమ్మకాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో... గిరిజనులు నేటికీ మూఢనమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో సిల్లంగి వంటి అపోహలను నమ్మొద్దని ఆయన సూచించారు. గ్రామంలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా స్థానికంగా ఉన్న స్వర్ణ గ్రామ సచివాలయ మహిళ సంరక్షక కార్యదర్శి అందుబాటులో ఉంటుందని గుర్తు చేశారు.

విజయ్ త్రిష విడిపోయారా...?

విడిపోయిన .. 'విజయ్, త్రిష'.!_ _*విజయ్ - త్రిష* పెళ్లి చేసుకుంటారు అనుకుంటే.. *వారు విడిపోయారు* అనే టాక్ రెండు .. *ఇండస్ట్రీలను* కుదిపేస్తోంది._ _సోషల్ మీడియా లో  .. *విజయ్* ను అన్ ఫాలో చేసిన .. *త్రిష.*_ _*విజయ్ పుట్టినరోజు సందర్భాన్ని* పురస్కరించుకుని ... *అభిమానులంతా పండగ* చేసుకుంటుంటే, *త్రిష మాత్రం* ఆయనకు ...  *బర్త్‌డే విషెస్* కూడా చెప్పకుండా ... *కంప్లీట్ సైలెంట్‌గా* ఉండిపోవడం చర్చాంశనీయమైంది._ _విజయ్ విషయం లో .. *స్పందించే త్రిష,* విజయ్ బర్త్‌డే పోస్ట్‌ను ... *స్కిప్ చేయడం* వీరిద్దరూ విడిపోయారు అనే వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తోంది._ _విడాకులు తీసుకుంటారు అనుకున్న ... *సంగీత, విజయ్ మళ్లీ కలిసిపోయారని,* వారిమధ్య ఉన్న ... *మనస్పర్థలు* తొలగిపోయాయనే వార్తలు జోరుగా వచ్చాయి._ _ఈ వార్తల వల్లే 'త్రిష' ఇప్పుడు ... *విజయ్‌కు పూర్తిగా* దూరంగా ఉండాలని నిర్ణయించుకుందంటా.._

నువ్వులరేవులో సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో నూతనంగా నిర్మించిన స్వర్ణ గ్రామ సచివాలయ భవనాన్ని మంగళవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడానికి ఈ స్వర్ణ గ్రామ సచివాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు..

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్నబడామ్ సమీపంలో మంగళవారం ఉదయం పాల క్యాన్లతో వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టిసి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నందిగాం మండలం కవిటి అగ్రహారం గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు చిన్నపాటి గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

చోరికి గురైన 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల దొంగతనానికి గురైన 13 ద్విచక్ర వాహనాలను కాశీబుగ్గ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం కాశీబుగ్గలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. పలాస మండలం కంబిరిగాం జంక్షన్ వద్ద కాశీబుగ్గ రామకృష్ణ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా... పెదంచల గ్రామానికి చెందిన నాతమిరి రఘునాదన్(31) దొంగతనం చేసిన ఓ వాహనంతో పట్టుబడ్డాడు. అనంతరం తనదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టగా... వివిధ ప్రాంతాలలో దొంగతనానికి పాల్పడిన 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగ ఇతన పై గతంలో 18 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో ప్రతిభ చూపించిన సిఐ రామకృష్ణ తో పాటు ఎస్ఐ లు సునీల్, నరసింహమూర్తి సిబ్బందికి త్వరలో రివార్డులు అందజేస్తామన్నారు.

శ్రీదేవికి బంగారు పతకంతో సన్మానించిన స్వామీజీ

శ్రీ మద్భవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి పండితుల ముందు చెప్పినందుకు….శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కాపు తెంబూరు గ్రామానికి చెందిన పోలాకి శ్రీదేవి….శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా బంగారు పతకం పొందారు. కాపు తెంబూరులో శనివారం నిర్వహించిన శివ కళ్యాణం సందర్భంగా ఆమెకు భర్త తిరుమలరావు తో కలిసి గీతా బృందం సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కొల్లి దీనబంధు, పోలాకి రామకృష్ణారావు, కారగ్గి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

ఒడిస్సా నుంచి గోవాకు గంజాయి తరలిస్తూ... కాశీబుగ్గ పోలీసులకు చిక్కిన యువకుడు.

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీప రహదారిపై శుక్రవారం కాశీబుగ్గ పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ ను పరిశీలించగా.. సుమారు ఐదు కిలోల గంజాయిని గుర్తించినట్లు శుక్రవారం కాశీబుగ్గ సీఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన యువకుడు గోవాకు అక్రమంగా ఈ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎస్సై సునీల్ తో పాటు హెచ్ సీ టెంక భాస్కర్ రావు సిబ్బంది పాల్గొన్నారు.

పలాసలో ఘోరం... ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి తల్లి ఆత్మహత్య.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తాళబద్ర ఎల్ సి గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర సంఘటన చోటుచేసుకుంది. తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పలాస జి ఆర్ పి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది..

రెంటికోటలో నేల కూలిన ఆసుపత్రి రక్షణ గోడ

ఇటీవల కురిసిన వర్షాలకు పలాస మండలం రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ప్రహరీ గోడ నేల కూలింది. దీంతో పశువులు ఆరోగ్య కేంద్ర ఆవరణలోకి ప్రవేశించి మొక్కలను ధ్వంసం చేస్తున్నాయని, మరోవైపు విష సర్పాలు ఆసుపత్రిలోకి వస్తున్నాయని ఇక్కడ సిబ్బంది తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే రక్షణ గోడను నిర్మించాలని సిబ్బంది కోరారు.

డ్రగ్స్ వద్దు బ్రో.. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ పిలుపు

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో  భాగంగా బుధవారం పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద కాశీబుగ్గ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక యువత చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత ఏ దేశానికైనా ప్రధాన శక్తిగా మారి దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తారని, అటువంటి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సునీల్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

నారీ శక్తిపై అవగాహన కల్పించిన ఎస్సై నరసింహమూర్తి

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద మంగళవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: ఎమ్మెల్యే శిరీష

స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. పలాస ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం స్వచ్ఛ రథాలను ఆమె ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఎండిఓ వసంత కుమార్,  ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, విఠల్, చిన్ని, శ్రీనివాసరావు, కృష్ణారావు, నవీన్  తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే శిరీష

రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత పై ఇటీవల మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను మంగళవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్ మీడియా ద్వారా మహిళలకు ఎవరైనా వేదిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని ఆమె కోరారు.

మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే శిరీష

రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత పై ఇటీవల మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను మంగళవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్ మీడియా ద్వారా మహిళలకు ఎవరైనా వేదిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని ఆమె కోరారు.

పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి లో రోగులకు ప్రతిరోజు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ అధికారి జి శ్రీరాములు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శిరీష

పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిటిపిసి చైర్మన్ వజ్జ బాబు రావు, ఏఎంసి చైర్మన్ మల్లా శ్రీనివాసరావు,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విట్టల్, వంకల కుర్మారావు, కుత్తుం లక్ష్మణరావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గురిటి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

పలాస జగన్నాథ్ సాగర్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జగన్నాథ సాగర్ గట్టు తదితర ప్రాంతాల అభివృద్ధికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. ఆదివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆమె అధికారులతో చర్చించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో మాట్లాడుతూ జగన్నాథ సాగర్ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.

బారువ సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC ఫర్మన్ అహ్మద్ ఖాన్ తో కలసి యోగా ఆసనాలను వేశారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి యోగా ద్వారా మానసిక శరీరిక ప్రశాంతతను పొంద వచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

ఎయిర్‌పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష  ​శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ​సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ​ఉపాధి అవకాశాలు: ఎయి...

నారీ శక్తి పై అవగాహన కల్పించిన ఎస్సై నరసింహమూర్తి

పలాస మండలం కొత్తూరు గ్రామంలో శుక్రవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశాం : ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమం గురించి వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ లు, మహిళలకు స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తున్నామన్నారు. పల్లె పండగ ద్వారా ప్రతీ గ్రామంలో రోడ్లు వేశామని వెల్లడించారు. పలాస నియోజకవర్గంలో దాదాపు రూ. 930 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కాశీబుగ్గ రైల్వే వంతెన త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఆఫ్ షోర్ జలాశయం కూడా త్వరలోనే పూర్తి చేసి నియోజక వర్గ ప్రజలకు సాగు, త్రాగు నీటిని అందిస్తామన్నారు. అమృత భారత్ కింద దాదాపు రూ. 60 కోట్లతో పలాస రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మరో వైపు జాబ్ మేళాలతో వందల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. పలాసలో ఒక జీడి బోర్డు కోసం స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ప్రస్తుతం పలాసలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రశాంతంగా ఉందన్నారు.

పలాసలో హౌసింగ్ అధికారుల దందా...!

పీఎం జన్ మన్ ఇళ్ల లబ్ధిదారుల వద్ద హౌసింగ్ అధికారులు దోచుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల వారికి ఇల్లు నిర్మాణానికి 2023లో "పీఎం జన్ మన్" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పలాస మండల పరిధిలో లోత్తూరు, లొద్దభద్ర, అల్లుకోల, తర్లాకోట పంచాయతీల పరిధిలో 60 ఇల్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మిస్తే రూ. 2.39 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జామవుతుంది. కాగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల వద్ద ఖర్చుల పేర్లతో సొమ్ము పడిన ప్రతిసారి డబ్బు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.