జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల దొంగతనానికి గురైన 13 ద్విచక్ర వాహనాలను కాశీబుగ్గ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం కాశీబుగ్గలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. పలాస మండలం కంబిరిగాం జంక్షన్ వద్ద కాశీబుగ్గ రామకృష్ణ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా... పెదంచల గ్రామానికి చెందిన నాతమిరి రఘునాదన్(31) దొంగతనం చేసిన ఓ వాహనంతో పట్టుబడ్డాడు. అనంతరం తనదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టగా... వివిధ ప్రాంతాలలో దొంగతనానికి పాల్పడిన 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
కాగ ఇతన పై గతంలో 18 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో ప్రతిభ చూపించిన సిఐ రామకృష్ణ తో పాటు ఎస్ఐ లు సునీల్, నరసింహమూర్తి సిబ్బందికి త్వరలో రివార్డులు అందజేస్తామన్నారు.