Skip to main content

Posts

Showing posts from July, 2026

మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన న్యాయస్థానం.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ కేసులో మాజీ మంత్రి తనయుడు ఆరవ్ వర్మతో పాటు సిద్ధార్థ త్యాడి లకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.. ఘటనలో సాక్షాదారాలు తారుమారు చేశారని అభియోగంతో... రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ పిటిషన్ ఆరువ జిల్లా అదనపు కోర్టు సోంపేట న్యాయమూర్తి శుక్రవారం డిస్మిస్ చేశారు.

మహిళ ఎస్సై కు అండగా నిలిచిన ఎమ్మెల్యే గౌతు శిరీష

శ్రీకాకుళం జిల్లాలో గురువారం వైయస్ జగన్ పర్యటనలో విధి నిర్వహణలో ఉన్న మహిళ ఎస్సై ప్రవల్లిక పై వైకాపా మూకలు దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆమెను పరామర్శించారు. దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆమె స్పష్టం చేశారు.

పలాసలో చెట్టుకు వేలాడుతున్న గుర్తు తెలియని మృత దేహం.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి జంక్షన్ సమీప జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చెట్టుకు వేలాడుతున్న ఓ గుర్తు తెలియని యువకుని మృతదేహం శుక్రవారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మాజీ మంత్రి సీదిరి తనయుడుకి బెయిల్ మంజూరు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ కేసులో ఇప్పటికే అంపోలు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ మంత్రి తనయుడు ఆరవ్ వర్మతో పాటు సిద్ధార్థ త్యాడిలకు జిల్లా ఆరువ అదనపు కోర్టు సోంపేటలో మంగళవారం బెయిల్ మంజూరు అయింది. మరోవైపు మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తయినప్పటికీ.. జడ్జ్ తీర్పు వెల్లడించలేదు. ఇది ఎలా ఉండగా మాజీ సీఎం జగన్ ఈనెల 30వ తేదీన అంపోలు జైలుకు రానున్న విషయం తెలిసిందే...!

దానయ్య కుటుంబానికి రూ. 5.50 లక్షల ఆర్థిక సాయం

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... బాధిత కుటుంబ సభ్యులకు జర్నలిస్టు, గుండుసూది PINN & AP 175 యూట్యూబ్ ఛానెల్స్ అధినేత మానెం శ్రీనివాస్ మంగళవారం పరామర్శించారు. అనంతరం తన యూట్యూబ్ ఛానెల్స్ ఫాలోవర్స్ అందించిన రూ. 5.50 లక్షలు అందించారు. ఈ మొత్తం సొమ్మును మృతుని భార్య ద్రౌపతి పేరున బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఫిక్స్ డిపాజిట్ చేసి గొప్ప మనసు చాటుకున్నారు. 

కారు టైరు పేలడంతో... ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు టైరు పేలడంతో అదుపుతప్పి లారీ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. పోలాకి కి చెందిన ఏడుగురు వ్యక్తులు రాజాం వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సిక్కోలు జిల్లా శ్రీశయన సంఘ అధ్యక్షుడు తాతయ్యకి ఘన సన్మానం

శ్రీకాకుళం.... శ్రీశయన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ఏకీభావ తీర్మానంతో ప్రశాంతంగా ముగిశాయి. సుమారు 75 గ్రామాల పరిధిలోని కుల పెద్దల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలకు కుల రాజు మడ్డి కాళిదాసు  సతీమణి చిట్టమ్మ  అధ్యక్షత వహించారు. సందర్భంగా సంఘం నూతన అధ్యక్షుడిగా బింగి తాతయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఆనింగి చంద్రశేఖర్ (రాజు), కోశాధికారిగా బత్తిని తారకేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా రెల్ల జయరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతన కమిటీ ఎన్నికలు సుమారు 75 గ్రామాల కుల పెద్దల ఏకాభిప్రాయం, ఆమోదంతో జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని, సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా.. కవిటి మండలం పొందూరుపుట్టుగ గ్రామంలో ఆయనకు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు తప్పవు : డీఎస్పీ భవాని

తప్పుడు వార్తలు ప్రచురించిన ఓ పత్రిక పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ డిఎస్పి భవాని శనివారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈనెల 13వ తేదీన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పితాతొలి జంక్షన్ వద్ద లగేజీ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో.. నర్తు వెంకటరమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని, ఆయన విశాఖ కే జి హెచ్ లో చికిత్స పొందుతూ.. 14వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ ను తప్పించి వేరే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ప్రచురించిన వార్తను ఆమె తీవ్రంగా ఖండించారు.

మృతుని కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి శ్రీనివాస్

దానయ్య కుటుంబ పరిస్థితి హృదయ విదారకం. - ప్రమాద పరిస్థితిని తారుమారు చేసిన మాజీ మంత్రి అప్పలరాజు పై చర్యలకు ఆదేశం  - నీతి మాటలు వల్లించడంలో మంత్రి అప్పలరాజు ఘనుడు  - డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ది  - పార్టీ తరఫున పది లక్షల రూపాయల నష్ట పరిహారం  - దానయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండ  - మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గౌతు శిరీష వెల్లడి శ్రీకాకుళం, జులై 13, ఇటీవల మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబ పరిస్థితి చూస్తే హృదయ విదారకంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి, శ్రీకాకుళం ఇన్చార్జి మంత్రివర్యులు కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తో కలిసి దానయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం  మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... మృతుని (దానయ్య) కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున పది లక్షల రూపాయలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మా...

ఎయిర్ పోర్టు నిర్మాణానికి సహకరించండి : కేంద్ర మంత్రి రామ్మోహన్

శ్రీకాకుళం జిల్లా పలాస ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్దాన ప్రజలు అందుకు సహకరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.  మందస మండలం బిడిమి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో స్థానిక యువకుల భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలని, నిర్వాసితులకు తగిన నష్టపరిహారం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

విజయ్ పుట్టినరోజు సందర్భంగా.. రక్తదానం చేసిన యువకులు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన  గుంటు విజయ్ పుట్టినరోజు సందర్భంగా జెంట్స్ ఆసుపత్రి సహకారంతో గ్రామంలో రక్తదాన శిబిరంతో పాటు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత సుమారు 30 మంది పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేసిన యువకులకు ఆయన అభినందనలు తెలిపారు. మీరు చేసిన ఈ త్యాగం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ బ్రదర్స్(విజయ్, భాస్కర్, వాసు) తో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పలాసలో బుల్లెట్ వాహనం ఢీకొని గొర్రెల కాపరి మృతి.

శ్రీకాకుళం జిల్లా పలాస ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో పాత జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సూది కొండ కాలనీకి చెందిన గొర్రెల కాపరి దుబ్బ దానయ్య (45) మృతి చెందారు. కాశీబుగ్గ పట్టణానికి చెందిన యువకుడు సిద్ధార్థ త్యాడి బుల్లెట్ వాహనంతో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పలాసలో మృతిచెందిన వ్యక్తి వివరాలు ఇవే..!

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి మూడు రోడ్ల జంక్షన్ వద్ద శుక్రవారం డ్రైనేజీ పై ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడు కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన బుల్లోజు సోమేశ్వరరావు (36) గా గుర్తించారు. కాగా కుటుంబ కలహాలతో మృతుని భార్య తన కన్న వారైన కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అంతరకుడ్డ గ్రామం ఉంది. ఘటనపై కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నీరు లేని బావిలో భారీ అనకొండ...! ఉత్కంఠ భరిత రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ఓంకార్.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జలంతర శాసనామ్ లో నీరులేని బావిలో ఓ భారీ అనకొండ పడిపోయింది. గమనించిన స్థానికులు... పలాస కు చెందిన స్నేక్ క్యాచర్ ఓంకార్ కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నీరు లేని బావిలోకి సాహసోపేతంగా దిగి అనకొండను బయటకు తీసేందుకు సత విధాల ప్రయత్నించిన సాధ్య పడలేదు. దీంతో అటవీ శాఖ అధికారులకు ఆయన సమాచారం అందించారు.

జిల్లా అండర్ -19 క్రికెట్ జట్టుకి ఎంపికైన అభినయ్

శ్రీకాకుళం జిల్లా అండర్ - 19 బాలుర క్రికెట్ జట్టుకి శ్రీకాకుళం పట్టణానికి చెందిన విద్యార్థి పి అభినయ్ ఎంపికైనట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రకటించింది. విద్యార్థి ఎంపిక పట్ల తల్లిదండ్రులు, కోచ్ ఎస్ హెచ్ శ్రీనివాస్, రఘు ఇంజనీరింగ్ కళాశాల స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాటు జిల్లా క్రికెట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ వాసులు అభినందించారు.

జిల్లా అండర్ -19 క్రికెట్ జట్టుకు ఎంపికైన పలాస విద్యార్థి

శ్రీకాకుళం జిల్లా అండర్ - 19 బాలుర క్రికెట్ జట్టుకి పలాస కు చెందిన విద్యార్థి కొండెటి వర్ధన్ ఎంపికైనట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రకటించింది. విద్యార్థి ఎంపిక పట్ల తల్లిదండ్రులు, కోచ్ మన్యాల అవినాష్, మూర్తి, జగదీష్ తో పాటు జిల్లా క్రికెట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు, జంట పట్టణ వాసులు అభినందించారు.

లైంగిక నేరాలు నివారణకు అవగాహనే ఆయుధం : మధుర మీనాక్షి.

మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ గౌరవ సంచాలకులు గారి ఆదేశాల మేరకు, బాలల్లో లైంగిక నేరాలు నివారణకు అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నాడు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ శ్రీకాకుళం జిల్లా వారి ఆధ్వర్యంలో ఒప్పంగి యంపియుపి స్కూల్ నందు జిల్లా బాలల రక్షణ విభాగం అధికారి డి మధుర మీనాక్షి బాలల లైంగిక నేరాల నిషేధ చట్టం గురించి అవగాహన నిర్వహించి లైంగిక నేరాల నుండి బాలలు తమను తాము ఎలా కాపాడుకోవాలి, ఎలా జాగ్రత్త వహించాలి మరియు బాలలకి అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరి దగ్గర నుండి సహకారం తీసుకోవాలి, ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొనాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. అలాగే బాలల హక్కులు గురించి, గుడ్ టచ్- బ్యాడ్ టచ్, మై బాడీ మై రైట్ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్ గురించి అవగాహన కల్పించారు.  మానసిక ఆరోగ్య సహాయానికి సంబంధించిన 14416 హెల్ప్‌లైన్, మహిళల సహాయార్థం 181 ఉమెన్ హెల్ప్‌లైన్, పిల్లల రక్షణ కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, అత్యవసర సేవల కోసం 112 పోలీస్ హెల్ప్‌లైన్ సేవల గురించి వివరించారు. అవగాహన సదస్సులో పాఠశాల...

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై మధుసూదన్ రావు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఎస్సై ఏ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలు వసూలు చేసి, వాహన పత్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ కాటమ్మ తల్లి సంబర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

పలాస ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కాటమ్మ తల్లి సంబరాల్లో ఎమ్మెల్యే శిరీష పాల్గొని, ఘటాన్ని మోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలాస, జూలై 5 (ఆదివారం): పలాస-కాశీబుగ్గ పట్టణంలో పలాస ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాటమ్మ తల్లి అమ్మవారి వార్షిక సంబరాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఉదయం నుంచే అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు, యువత, చిన్నారులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలు, జైజైధ్వానాలతో మారుమోగాయి. ఈ వేడుకల్లో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారి ఘటాన్ని స్వయంగా తలపై మోసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే ఘటాన్ని మోసి పూజలు నిర్వహించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు, ఆటో యూనియన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికి సత్కరించారు....

రక్తదానంతో ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్న ఆ నలుగురు సేవా సంస్థను స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే శిరీష ప్రారంభించారు. పలాస లేబర్ యూనియన్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ శిబిరంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని రక్తాన్ని దానం ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సేవలో అందిస్తున్న ఆ నలుగురు సంస్థ సభ్యులకు ఆమె అభినందించారు.

పలాసలో రైలు ఎక్కుతూ పట్టుతప్పి రెండు చేతులు కోల్పోయిన యువకుడు.

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో శనివారం యువకుడు ట్రైన్ ఎక్కుతూ... పట్టు తప్పి కింద పడటంతో రెండు చేతులు నుజ్జునుజ్జు అయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన యువకుడుని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించి ఘటనపై జి ఆర్ పి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వికసిత్ భారత్ - జి రామ్ జి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా  మండలం తర్లాకోటలో గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష "వికసిత్ భారత్ - జి రామ్ జి" పథకాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం చెరువు గట్టుపై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉపాధి రోజులు 100 నుంచి 125 రోజులకు పెంచుతూ.. రోజువారి వేతనం రూ. 312 చెల్లిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పి టి పి సి చైర్మన్ వజ్జ బాబురావు, విఠల్, సంతోష్ నాయుడు, మున్నా, కూర్మారావ్ తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి : డీఎస్పీ భవాని

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో బుధవారం కాశీబుగ్గ డిఎస్పి భవాని ఆధ్వర్యంలో "అభయం" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఉద్యమాల గడ్డగా పేరుగాంచిన బొడ్డపాడు ప్రజలు మీకోసం మీకుటుంబం కోసం ఒక్కక్షణం ఆలోచించాలని ఆమె తెలిపారు. హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, ఎస్సై సునీల్ సిబ్బందితోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

పలాసలో మయూర నగర వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం జంక్షన్ సమీపంలో కూటమి ప్రభుత్వం మొదటి విడత సుమారు రూ. 1.40 కోట్ల నిధులతో నిర్మించిన మయూర వనాన్ని బుధవారం Dc వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ... 120 హెక్టార్ల పరిధిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతీయ రహదారికి ఆనుకుని ఈ మయూర వనం రానున్న రోజుల్లో జంతు ప్రదర్శనశాలగా మార్చేందుకు కేంద్రం నుంచి అనుమతులు కోరమని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మయూర వనాన్ని ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సందర్శకులకు అనుమతిస్తారని, ప్రతి వ్యక్తికి 20 రూపాయలు టికెట్, పిల్లలకి ₹10 ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సప్నికల్ దినకర్, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, గ్రంధాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్, బిసి సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు ఇతర ముఖ్య నాయకులు, కూటమి నాయకులు చిన్ని, నాగరాజు, అటవీశాఖ అధికారులు, ఆర్టీవో గారు  వివిధ శాఖల అ...

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు(M) పెద్దబొడ్డపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నార. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి నెలా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.