శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన గుంటు విజయ్ పుట్టినరోజు సందర్భంగా జెంట్స్ ఆసుపత్రి సహకారంతో గ్రామంలో రక్తదాన శిబిరంతో పాటు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత సుమారు 30 మంది పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేసిన యువకులకు ఆయన అభినందనలు తెలిపారు. మీరు చేసిన ఈ త్యాగం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ బ్రదర్స్(విజయ్, భాస్కర్, వాసు) తో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.