Skip to main content

Posts

Showing posts from August, 2026

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉద్దానంలో దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరం.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే  ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?

ఒడిశా తీరంలో నౌక మునక.. 24 మంది గల్లంతు?

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయింది. పనామా జెండాతో వెళ్తున్న కార్గో షిప్లో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా నుంచి ఐరన్ ఓర్ను సింగపూర్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైన ఇచ్చాపురం విద్యార్థి

జిల్లా స్థాయి యోగ పోటీల్లో సత్తా చాటిన సాయి జగదీశ్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 6వ తేదీన నిర్వహించిన జిల్లా స్థాయి యోగ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌ యోగ పోటీల్లో సాయి జగదీశ్‌ పాల్గొననున్నారు. జిల్లా స్థాయిలో సాధించిన విజయాన్ని రాష్ట్ర స్థాయిలోనూ కొనసాగించి ప్రతిభ కనబరచాలని పలువురు క్రీడాకారులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాయి జగదీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

గరుడుభద్రలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ తిరుపతిరావు.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో శుక్రవారం సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నిహార్ తో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

తమిళనాడు గంజాయి తరలిస్తూ.. కాశీబుగ్గ పోలీసులకు చిక్కిన నలుగురు యువకులు.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు జంక్షన్ వద్ద పోలీసులు గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా... తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 3.85 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిస్సా రాష్ట్రం గుణుపూర్ నుంచి తమిళనాడు రైలు మార్గంలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. పట్టుబడినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు.

పలాసలో మినీ స్టేడియం పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే శిరీష వినతి.

పలాసలో 2019లో ప్రారంభమైన మినీ స్టేడియం నిర్మాణ పనులు నేటికీ అసంపూర్తిగా నిలిచిన పనులను, వెంటనే పూర్తి చేయాలని శాప్ చైర్మన్ రవి నాయుడును మంగళవారం ఎమ్మెల్యే శిరీష కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాస ప్రాంతంలో క్రీడలకు మరింత ప్రోత్సాహం కల్పించడంతోపాటు యువతకు మెరుగైన క్రీడా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా.. గీత కార్మికులకు ఘన సన్మానం.

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతి సందర్భంగా.. శ్రీ చైతన్య దీపిక ఆధ్వర్యంలో గీత కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ఓ నిరుపేద గీత కార్మిక కుటుంబంలో జన్మించిన డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా యువత అడుగులు వేయాలని కోరారు. అనంతరం పలువురు గీత కార్మికులకు ఘనంగా సన్మానించారు.

సర్దార్ గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

విజయవాడ లో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా ఆయన 3వ తరం వారసురాలు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..  సామాజిక మార్పు కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి లచ్చన్న అని ఆయన అందించిన సేవలకు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు తో పాటు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.

పలాసలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... నాడు స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే నేడు మనకు జెండా పండుగ అని వారి త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శ్రీనివాసులు, కూటమి నాయకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

మాజీ మంత్రి సీదిరి బెయిల్ పై తీర్పు రేపటికి వాయిదా

మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రేపటికి వాయిదా వేశారు. నాలుగు రోజుల  కస్టడీకి పోలీసులు వేసిన పిటిషన్ పలాస కోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సోంపేట ఆరవ అదనపు జిల్లా కోర్టు తీర్పు పై సర్వత్ర ఎదురుచూస్తున్నారు.

సముద్రంలో వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన సూరాడ విశాఖ (45) గురువారం సముద్రంలోకి వేటకు వెళ్లి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తోటి మత్స్యకారులతో సముద్రంలోకి వేటకు వెళ్లిన సమయంలో రాకాసి అలల తాకిడికి తెప్ప బోల్తా పడడంతో మృతి చెందినట్లు భార్య దానమ్మ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగ మృతునికి కుమారుడు తిరుపతిరాజు, కుమార్తెలు ప్రేమ, వాణి ఉన్నారు. దీంతో మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మాజీ మంత్రి అప్పలరాజు కస్టడీ పిటిషన్ కొట్టివేత.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కస్టడీ పిటిషన్ ను బుధవారం పలాస కోర్ట్ న్యాయమూర్తి కొట్టివేశారు. మరోవైపు సోంపేట ఆరవ అదనపు జిల్లా కోర్టులో ఆయన తరఫున బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.. జులై 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో సాక్ష్యాధారాలు తారుమారు చేశారన్న ఆరోపణలతో జులై 22న ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే.

మాజీ మంత్రి సీదిరి కస్టడీ పిటిషన్ కొట్టివేసిన న్యాయమూర్తి

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కస్టడీ పిటిషన్ ను బుధవారం పలాస కోర్ట్ న్యాయమూర్తి కొట్టివేశారు. మరోవైపు సోంపేట ఆరవ అదనపు జిల్లా కోర్టులో ఆయన తరఫున బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.. జులై 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో సాక్ష్యాధారాలు తారుమారు చేశారన్న ఆరోపణలతో జులై 22న ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపు.

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. మంగళవారం కూటమి నాయకులు, టిడిపి శ్రేణులతో స్థానిక టిడిపి కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సమన్వయం, ప్రజలతో మరింత మమేకమై పనిచేయాలని ఆమె ఆదేశించారు.

మాజీ మంత్రి అప్పలరాజును నాలుగు రోజులు కస్టడీకి కోరుతూ.. పోలీసుల పిటిషన్.

మాజీ మంత్రి అప్పలరాజును నాలుగు రోజులు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ... నేడు పలాస జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు సోంపేట ఆరవ అదనపు జిల్లా కోర్టులో మాజీ మంత్రి అప్పలరాజుకు బెయిల్ పిటిషన్ ను ఆయన తరపు న్యాయవాది వేశారు. ఇది ఇలా ఉండగా... జూలై 10వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో సాక్షాధారాలు తారుమారు చేశారని అభియోగంతో జూలై 22వ తేదీన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

మాజీ మంత్రి అప్పలరాజును నాలుగు రోజులు కస్టడీకి కోరుతూ.. పోలీసుల పిటిషన్.

మాజీ మంత్రి అప్పలరాజును నాలుగు రోజులు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ... నేడు పలాస జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు సోంపేట ఆరవ అదనపు జిల్లా కోర్టులో మాజీ మంత్రి అప్పలరాజుకు బెయిల్ పిటిషన్ ను ఆయన తరపు న్యాయవాది వేశారు. ఇది ఇలా ఉండగా... జూలై 10వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో సాక్షాధారాలు తారుమారు చేశారని అభియోగంతో జూలై 22వ తేదీన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

యోగ పోటీల్లో సత్తా చాటిన సిక్కోలు విద్యార్థి

చెన్నైలో జరిగిన అండర్ - 16 యోగాసన ఛాంపియన్షిప్ పోటీల్లో ఇచ్చాపురం పట్టణానికి చెందిన విద్యార్థి పాలేపు సాయి జగదీష్ నాలుగు పతకాలను కైవసం చేసుకున్నాడు. ట్విస్టింగ్‌ విభాగంలో స్వర్ణ పతకం, ఫార్వర్డ్‌ బెండింగ్‌లో రజత పతకం, స్టాండింగ్‌లో రజత పతకం, బ్యాక్‌వర్డ్‌ బెండింగ్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పట్టణవాసులు అభినందించారు.

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి... నలుగురికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా మందస మండలం గిరిజన ప్రాంతమైన పెడంగో గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు పాతకోట జ్వర(45), సుమాంద్రి(43) మృతి చెందగా.. మరో నలుగురు మహిళలు గాయాల పాలయ్యారు. మహిళలంతా వ్యవసాయ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన బుయ పూర్ణి(48), కుమార్ నీలావతి(38), కొత్త సుస్మిత(32), మజ్జి దేవిక(34) లను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ రహదారిపై అదుపుతప్పిన గ్యాస్ ట్యాంకర్

శ్రీకాకుళం జిల్లా కంచిలి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఖుర్దారోడ్ వెళ్తున్న ఇండియన్ ఆయిల్ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి వరద కాలువలోకి జారుకొని ఇరుక్కుపోయింది.విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం  చేస్తున్నారు.

మధ్యవర్తిత్వంతో త్వరితగతిన న్యాయం పొందవచ్చు: జడ్జ్ మాధురి

"మధ్యవర్తిత్వం దేశం కోసం" కార్యక్రమంలో భాగంగా గురువారం పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలాస కోర్ట్ సివిల్ జడ్జి యు మాధురి మాట్లాడుతూ... మధ్యవర్తిత్వ చర్చల ద్వారా కేసులను సులభంగా, వేగంగా పరిష్కరించుకొని న్యాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు.

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామంలో గురువారం జరిగిన "మీ భూమి మీ హక్కు" కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులకు ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతే రాజు అనే సూత్రంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రైతులకు వారి భూమిపై పూర్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.

వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామంలో సుమారు రూ. 21.2 లక్షల నిధులతో జేజేఎమ్ వాటర్ ట్యాంక్ పనులను గురువారం ఎమ్మెల్యే శిరీష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇంటింటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ విచారణ రేపటికి వాయిదా

మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ విచారణ రేపటికి వాయిదా వేస్తూ... సోంపేట ఆరవ  జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. జూలై 10 తేదీన కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో సాక్షాధారాలు తారుమారు చేశారని అభియోగంతో జులై 22న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు నేటితో 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో రిమాండ్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మా సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలకు సిద్ధం: పద్మజి

శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణానికి చెందిన సూర్య తేజ విద్యా సంస్థలపై ఇటీవల అసత్య ఆరోపణలతో పలు పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ ప్రిన్సిపాల్ దానేటి పద్మజి హెచ్చరించారు. బుధవారం పలాసలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సూర్యతేజ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి పై చదువులకు వెళ్లిన విద్యార్థినిపై నాన్ టీచింగ్ స్టాఫ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆమె వివరించారు.

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీస్ కస్టడికి కోర్టు అనుమతి.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పోలీసు కస్టడీకి పలాస కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న ఆయనను ఒక రోజు పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. దీంతో రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ఆయనను విచారించనున్నారు. కాగా.. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడిని కాపాడేందుకు సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.

రాష్ట్రస్థాయి క్యారమ్ పోటీల్లో ప్రథమ ర్యాంక్ సాధించిన హరిప్రియ

నెల్లూరు జిల్లా క్యారమ్ సంఘ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి క్యారమ్ పోటీల్లో శ్రీకాకుళం (D), కవిటి (M), జగతి గ్రామానికి చెందిన ఎల్ హరిప్రియ ప్రథమ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు నగదు బహుమతితో పాటు ట్రోపీను అందించారు. హరిప్రియ ఇదివరకే జాతీయస్థాయిలో క్యారమ్ పోటీల్లో పాల్గొని ఇప్పటికే పలు పథకాలు సాధించిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు హరిప్రియకు అభినందించారు.