పలాసలో 2019లో ప్రారంభమైన మినీ స్టేడియం నిర్మాణ పనులు నేటికీ అసంపూర్తిగా నిలిచిన పనులను, వెంటనే పూర్తి చేయాలని శాప్ చైర్మన్ రవి నాయుడును మంగళవారం ఎమ్మెల్యే శిరీష కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాస ప్రాంతంలో క్రీడలకు మరింత ప్రోత్సాహం కల్పించడంతోపాటు యువతకు మెరుగైన క్రీడా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.