మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పోలీసు కస్టడీకి పలాస కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న ఆయనను ఒక రోజు పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. దీంతో రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ఆయనను విచారించనున్నారు. కాగా.. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడిని కాపాడేందుకు సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.