శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన సూరాడ విశాఖ (45) గురువారం సముద్రంలోకి వేటకు వెళ్లి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తోటి మత్స్యకారులతో సముద్రంలోకి వేటకు వెళ్లిన సమయంలో రాకాసి అలల తాకిడికి తెప్ప బోల్తా పడడంతో మృతి చెందినట్లు భార్య దానమ్మ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగ మృతునికి కుమారుడు తిరుపతిరాజు, కుమార్తెలు ప్రేమ, వాణి ఉన్నారు. దీంతో మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.