మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కస్టడీ పిటిషన్ ను బుధవారం పలాస కోర్ట్ న్యాయమూర్తి కొట్టివేశారు. మరోవైపు సోంపేట ఆరవ అదనపు జిల్లా కోర్టులో ఆయన తరఫున బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.. జులై 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో సాక్ష్యాధారాలు తారుమారు చేశారన్న ఆరోపణలతో జులై 22న ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.