కలకత్తా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) రైలులో ప్రయాణం చేస్తూ... ఆదివారం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ జారిపడింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సత్యం & వెంకట్రావు ఘటన స్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స అందించి, వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ అస్సాం కు చెందిన అజ్వినా ఖాన్ గా గుర్తించి కేసు నమోదు చేసిన పలాస జిఆర్పి పోలీసులు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.