Skip to main content

Posts

Showing posts from October, 2026

వజ్రపుకొత్తూరు ఎంపీపీ కూటమి అభ్యర్థిగా శోభారాణి నామినేషన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల పరిధి కూటమి ఎంపీపీ అభ్యర్థిగా శ్రీమతి పుచ్చ శోభారాణి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెండున్నర ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి నన్ను ఆశీర్వదించండి అని కోరారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే శిరీష సహకారంతో వజ్రపుకొత్తూరు మండల పరిధిలో ఉన్న గ్రామాలలో మౌలిక వసతులు సమకూరుస్తూ.. మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుచ్చ ఈశ్వర్రావు, కర్ని రమణతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

పలాసలో కూటమి అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారాల హోరు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం మండుటెండను లెక్కచేయకుండా కూటమి అభ్యర్థులతో కలిసి 25(సప్ప అమ్మోజి), 36(పెద్దగోపు జగదాంబ) వార్డుల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండున్నర  కాలంలో కూటమి ప్రభుత్వం పుర ప్రజలకు అందించిన సేవలను గుర్తించి కూటమి అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో పలాస పట్టణ రూపు రేఖలను  మార్చుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి చైర్పర్సన్ అభ్యర్థి వజ్జ గంగాభవాని తో పాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.

4వ వార్డులో జోరుగా సాగుతున్న వైకాపా అభ్యర్థుల ప్రచారం

స్థానిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 4వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ వైకాపా అభ్యర్థి శ్రీపద్మతో కలిసి అంబుసోలి గ్రామంలో బుధవారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి గత ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పనులు గూర్చి వివరించారు. 4వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తెప్ప దమయంతి సహాయంగా 11వ వార్డ్ వైకాపా అభ్యర్థి మీసాల శోభిత సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబు, తెప్ప పాపారావు, వాయులపల్లి లక్ష్మణ్, బోనెల రవి కుమార్ తోపాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.

హస్తం గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించండి: బద్రి సీతమ్మ

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బద్రి సీతమ్మ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తరపున చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందిస్తానని, నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మరోవైపు వీధుల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తూ... ఈనెల 28న జరగబోయే పోలింగ్ లో హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.

హస్తం గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించండి: బద్రి సీతమ్మ

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బద్రి సీతమ్మ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తరపున చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందిస్తానని, నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మరోవైపు వీధుల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తూ... ఈనెల 28న జరగబోయే పోలింగ్ లో హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.

కవిటి మండల ఎంపీపీ కుర్చీపై దృష్టి పెట్టిన కాళిప్రసాద్

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.

10వ వార్డు జనసేన అభ్యర్థి జగదాంబ నామినేషన్ దాఖలు.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 10వ వార్డు కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున పెద్దగోపు జగదాంబ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ప్రజలు కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఒక మహిళగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. వార్డు పరిధిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు.

11వ వార్డ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రీటా.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 11వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నెయ్యిల రీటా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపిస్తే ఒక మహిళగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. వార్డు పరిధిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు.

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 12వ పై జనసేన ప్రత్యేక దృష్టి

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఆశావాదులు ఇప్పటికే తమ తమ వార్డుల పరిధిలో వ్యూహాలు రచిస్తున్నారు. 12వ వార్డ్ పై జనసేన అభ్యర్థి మేడిశెట్టి రమణమూర్తి గురిపెట్టారు. ప్రత్యర్థి ఎవరైనా..? ఇప్పటికే వార్డు ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడుతూ.. వారికి అండగా నిలుస్తున్నారు.  ఇటీవల జనసేన పార్టీ విడుదల చేసిన నియోజకవర్గ స్థాయి ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా మేడిశెట్టి రమణమూర్తి ఎన్నికైన విషయం తెలిసిందే.

కూటమి ప్రభుత్వం చైర్మన్ అభ్యర్థుల ప్రకటన

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా.. అధికార పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. జిల్లా కేంద్రంలో మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ అవకాశం ఇవ్వగా... ఆమదాలవలస, పలాస, ఇచ్చాపురం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థులుగా టిడిపి పార్టీ కు కేటాయించింది. ఇప్పటికే వైకాపా నుంచి తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

పలాస మున్సిపల్ చైర్మన్ వైకాపా అభ్యర్థిగా తలాసు శ్రీపద్మ ఖరారు

పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ అన్ రిజర్వుడ్ మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.. వైకాపా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. పలాస కు చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ సతీష్ భార్య తలాసు శ్రీపద్మ(కలింగవైశ్య) పేరును వైకాపా పలాస చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు అధికార పార్టీ నేటికీ తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

ఇచ్చాపురం వైకాపా చైర్మన్ అభ్యర్థిగా పిలక రాజ్యలక్ష్మి ఖరారు

ఇచ్చాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బిసి మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.. వైకాపా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇచ్చాపురానికి చెందిన చెందిన పిలక రాజ్యలక్ష్మి (రెడ్డిక) పేరును వైకాపా ఇచ్చాపురం చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. కాగా ఈమె గత రెండు పర్యాయాలు చైర్మన్ గా పనిచేసిన విషయం తెలిసిందే.. మరోవైపు అధికార పార్టీ నేటికీ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

పలాసలో అమానుష ఘటన.. మురుగు కాలువలో మృత పసికందు

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి మొగిలిపాడులో అమానుష ఘటన చోటుచేసుకుంది. గురువారం స్థానిక మురుగు కాలువలో మగ శిశువు మృత పిండాన్ని స్థానికులు చూసి ఆందోళన చెందుతూ... పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత శిశువును స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఏ తల్లి కన్న బిడ్డో ఇలా మురుగు కాలువలో పడేయడంతో స్థానికులు కంట తడి పెట్టుకున్నారు.

పలాసలో వైకాపా నుంచి చైర్మన్ అభ్యర్థి ఎవరంటే?

పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బిసి మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.. వైకాపా నుంచి మాజీ ఏఎంసీ చైర్మన్ పివి సతీష్ సతీమణి మల్ల శ్రీపద్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు అధికార పార్టీ నుంచి ముందస్తు స్థానిక ప్రజల అభిప్రాయాలను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(IVR) ద్వారా సేకరిస్తున్నారు. మల్ల లలిత కుమారి, వజ్జ గంగాభవాని, మల్లిపెద్ది అరుణ, లొడగల దేవస్మిత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

పలాసలో IVR ద్వారా చైర్మన్ అభ్యర్థి ఎంపిక

పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బిసి మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ముందస్తు స్థానిక ప్రజల అభిప్రాయాలను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(IVR) ద్వారా సేకరిస్తున్నారు.     1. మల్ల లలిత కుమారి,  2. వజ్జ గంగాభవాని,  3. మల్లిపెద్ది అరుణ 4. లొడగల దేవస్మిత  అధికార పార్టీ చైర్మన్ అభ్యర్థిలుగా పోటీలో ఉన్నారు.

పలాసలో IVR ద్వారా చైర్మన్ అభ్యర్థి ఎంపిక.

పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బిసి మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ముందస్తు స్థానిక ప్రజల అభిప్రాయాలను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(IVR) ద్వారా సేకరిస్తున్నారు.     1. మల్ల లలిత కుమారి,  2. వజ్జ గంగాభవాని,  3. మల్లిపెద్ది అరుణ 4. లోడగల దేవశ్రీ   చైర్మన్ అభ్యర్థి పోటీల్లో ఉన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన విజయ్ బ్రదర్స్

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు(M) మంచినీళ్ళపేట గ్రామానికి చెందిన యువకుడు గంట ధనరాజు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందిన విషయం తెలిసిందే... విషయం తెలుసుకున్న కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ బ్రదర్స్ మృతుని భార్య నాగమ్మకు బుధవారం పరామర్శించి, రూ. 30 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కాగా నాగమ్మకు 3నెలల చిన్నారి ఉంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంగపుత్రులకు ఎంతటి కష్టమొచ్చినా అండగా మేము ఉంటామని విజయ్ బ్రదర్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 4వ వార్డు పై జనసేన ప్రత్యేక దృష్టి

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వార్డుల రిజర్వేషన్ విడుదల కావడంతో ఆశావాదులు అభ్యర్థుల కోసం పోటీపడుతున్నారు. 4వ వార్డ్ ఎస్సీ మహిళకు కేటాయించడంతో.. స్థానిక జనసేన నాయకుడు తుంగాన దేవరాజ్ భార్య తుంగాన దివ్య కౌన్సిలర్ గా పోటీ చేయనుంది. ఇప్పటికే.. భార్య భర్తలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు స్వస్తి పలికి స్థానిక ప్రజల సమస్యల కోసం గడిచిన మూడు సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున నిలబడి తమ వంతు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే..

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 10వ వార్డు పై జనసేన ప్రత్యేక దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో.. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఆశావాదులు ఇప్పటికే తమ తమ వార్డుల పరిధిలో వ్యూహాలు రచిస్తున్నారు. 10వ వార్డ్ పై జనసేన అభ్యర్థి పెద్దగోపి శివకుమార్ గురిపెట్టారు. ప్రత్యర్థి ఎవరైనా..? ఇప్పటికే వార్డు ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడుతూ.. వారికి అండగా నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేసిన అనుభవంతో పాటూ... ఇటీవల జనసేన పార్టీ విడుదల చేసిన నియోజకవర్గ స్థాయి ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా శివకుమార్ ఎన్నికైన విషయం తెలిసిందే.

చీపురుపల్లిలో విలేజ్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లిలో MGNRES నిధులు సుమారు రూ. 28 లక్షలతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్ ను సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో పాటు అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే శిరీషను మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ రమణ

కాశీబుగ్గ నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జి.వి రమణ సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జంట పట్టణాలతో పాటు కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు.

జిల్లాలో ఎట్టకేలకు రిజర్వేషన్ల ఖరారు.

శ్రీకాకుళం జిల్లాలో ఒక నగరపాలక సంస్థతో పాటు మూడు పురపాలక సంఘాల రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో మహిళకు కేటాయించగా... ఆమదాలవలస, పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘాలలో జనరల్ మహిళకు అవకాశం కలిగింది. ఇచ్చాపురం పురపాలక సంఘానికి బీసీలకు అవకాశం కల్పిస్తూ.. అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయిన యువకుడికి అండగా నిలిచిన విజయ్ బ్రదర్స్.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పెద్ద అంగవానిపేట గ్రామానికి చెందిన యువకుడు అంగ ధర్మారావు (18) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో తన కాలును వైద్యులు తొలగించారు. విషయం తెలుసుకున్న కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ బ్రదర్స్ బాధిత యువకుడిని శనివారం పరామర్శించి రూ. 40 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంగపుత్రులకు ఎంతటి కష్టమొచ్చినా అండగా మేము ఉంటామని విజయ్ బ్రదర్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలపాడు మాజీ సర్పంచ్ షణ్ముఖరావు, కొత్తపేట మాజీ సర్పంచ్ పాపారావు, కంబాల రాయుడిపేట మాజీ సర్పంచులు చిరంజీవి, కోటేశ్వరరావు తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే శిరీష ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ.

శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే శిరీష ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలువురు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి వివరించారు. పలు సమస్యలపై అధికారులతో ఆమె మాట్లాడి తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచినీటి కుళాయి, మురుగు కాలువలు, ఉద్యోగ అవకాశాలు, గిరిజన ప్రాంతాలలో సెల్ సిగ్నల్ తదితర మొత్తం 36 వినతులు అందాయి.

క్రెడిట్ చోరీ...! ఎవరు బిడ్డకి తండ్రిగా మీరు చెప్పుకుంటారు: మంత్రి అచ్చెన్న

కాశీబుగ్గ రైల్వే వంతెన పనులనకు కేంద్ర ప్రభుత్వ నిధులు మళ్లించి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేయలేదని, మంత్రి అచ్చెన్న ఆరోపించారు. గురువారం కాశీబుగ్గ రైల్వే వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... క్రెడిట్ చోరీ కోసం కోసం సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి కృషితో, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో, 100% నిధులు కేంద్రం నుంచి తెచ్చి వంతెన పనులు పూర్తి చేశామని, ఎవరికో పుట్టిన బిడ్డని తనే తండ్రి అని చెప్పుకోవడం వారికే సొంతం అని ఎద్దేవా చేశారు.

20 ఎకరాల భూస్వామి కన్నా... నిరుపేదలైన మహిళలే మిన్న.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురంలో గురువారం నిర్వహించిన పేదల సేవలో (2.0) కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఓ మహిళ మాట్లాడుతూ...  సీఎం చంద్రబాబు ఆలోచన, పలాస నియోజకవర్గంలో గౌతు కుటుంబ ఆచరణ గూర్చి ఆమె వివరించారు.  ఆ రోజుల్లో మా గ్రామంలో ముగ్గురు వ్యక్తులకు మాత్రమే  కేవలం 30 రూపాయలు పింఛన్ మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ అందించే వారిని గుర్తు చేశారు.  పూట గడపడమే కష్టంగా ఉన్న రోజుల్లో... శివాజీ గారు వీధుల్లో పర్యటించి.. మహిళలతో మాట్లాడి, మహిళలు ఇళ్లల్లో కాకుండా.. ప్రతి మహిళ బ్యాంక్ మెట్లు ఎక్కితే అభివృద్ధి సాధ్యమని అందుకు  గ్రూపు(సంఘాలు)గా ఏర్పడాలని ఆయన సూచన మేరకు నేడు స్వయం ఉపాధి పొందుతున్నామని తెలిపారు. నెలకు ₹ 30  పొదుపు కట్టేందుకు, ఒక్కో మహిళకు ₹ 1000 రుణాలు ఇచ్చారని, కొంతకాలానికి ₹ 2000, మరికొంత కాలానికి ₹ 5000 చొప్పున రుణాలతో స్వయం ఉపాధి పొందే వాళ్ళమని తెలిపారు.  కానీ నేడు 15 మంది సభ్యులతో కలిగిన స్వయం శక్తి  సంఘానికి బ్యాంకులో సుమారు రూ. 20 లక్షల వరకు రుణాలు పొందుతున్నామని ఆమె తెలిపారు. గ్రామాల్...

20 ఎకరాల భూస్వామి కన్నా... నిరుపేదలమైన మహిళలే మిన్న.

సువర్ణపురంలో రూ. 2.80 కోట్ల నిధులతో రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురం పంచాయతీ పరిధిలో సుమారు రూ. 2.80 కోట్ల నిధులతో నూతనంగా రోడ్ల నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో పల్లె పండుగ ద్వారా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మాణం వలన పండగ వాతావరణం కనిపిస్తుందని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో.. మీ గ్రామానికి ఉపయోగపడే వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకొని మీ గ్రామ అభివృద్ధికి మీరే సహకారం అందించాలని కోరారు.