స్థానిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 4వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ వైకాపా అభ్యర్థి శ్రీపద్మతో కలిసి అంబుసోలి గ్రామంలో బుధవారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి గత ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పనులు గూర్చి వివరించారు. 4వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తెప్ప దమయంతి సహాయంగా 11వ వార్డ్ వైకాపా అభ్యర్థి మీసాల శోభిత సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబు, తెప్ప పాపారావు, వాయులపల్లి లక్ష్మణ్, బోనెల రవి కుమార్ తోపాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.