Skip to main content

10వ వార్డు జనసేన అభ్యర్థి జగదాంబ నామినేషన్ దాఖలు.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 10వ వార్డు కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున పెద్దగోపు జగదాంబ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ప్రజలు కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఒక మహిళగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. వార్డు పరిధిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు.

High Viewed News

కవిటి మండల ఎంపీపీ కుర్చీపై దృష్టి పెట్టిన కాళిప్రసాద్

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.

వజ్రపుకొత్తూరు ఎంపీపీ కూటమి అభ్యర్థిగా శోభారాణి నామినేషన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల పరిధి కూటమి ఎంపీపీ అభ్యర్థిగా శ్రీమతి పుచ్చ శోభారాణి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెండున్నర ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి నన్ను ఆశీర్వదించండి అని కోరారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే శిరీష సహకారంతో వజ్రపుకొత్తూరు మండల పరిధిలో ఉన్న గ్రామాలలో మౌలిక వసతులు సమకూరుస్తూ.. మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుచ్చ ఈశ్వర్రావు, కర్ని రమణతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం చైర్మన్ అభ్యర్థుల ప్రకటన

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా.. అధికార పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. జిల్లా కేంద్రంలో మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ అవకాశం ఇవ్వగా... ఆమదాలవలస, పలాస, ఇచ్చాపురం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థులుగా టిడిపి పార్టీ కు కేటాయించింది. ఇప్పటికే వైకాపా నుంచి తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

హస్తం గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించండి: బద్రి సీతమ్మ

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బద్రి సీతమ్మ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తరపున చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందిస్తానని, నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మరోవైపు వీధుల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తూ... ఈనెల 28న జరగబోయే పోలింగ్ లో హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.