పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బిసి మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.. వైకాపా నుంచి మాజీ ఏఎంసీ చైర్మన్ పివి సతీష్ సతీమణి మల్ల శ్రీపద్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు అధికార పార్టీ నుంచి ముందస్తు స్థానిక ప్రజల అభిప్రాయాలను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(IVR) ద్వారా సేకరిస్తున్నారు. మల్ల లలిత కుమారి, వజ్జ గంగాభవాని, మల్లిపెద్ది అరుణ, లొడగల దేవస్మిత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.