కాశీబుగ్గ రైల్వే వంతెన పనులనకు కేంద్ర ప్రభుత్వ నిధులు మళ్లించి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేయలేదని, మంత్రి అచ్చెన్న ఆరోపించారు. గురువారం కాశీబుగ్గ రైల్వే వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... క్రెడిట్ చోరీ కోసం కోసం సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి కృషితో, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో, 100% నిధులు కేంద్రం నుంచి తెచ్చి వంతెన పనులు పూర్తి చేశామని, ఎవరికో పుట్టిన బిడ్డని తనే తండ్రి అని చెప్పుకోవడం వారికే సొంతం అని ఎద్దేవా చేశారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.