శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఆశావాదులు ఇప్పటికే తమ తమ వార్డుల పరిధిలో వ్యూహాలు రచిస్తున్నారు. 12వ వార్డ్ పై జనసేన అభ్యర్థి మేడిశెట్టి రమణమూర్తి గురిపెట్టారు. ప్రత్యర్థి ఎవరైనా..? ఇప్పటికే వార్డు ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడుతూ.. వారికి అండగా నిలుస్తున్నారు. ఇటీవల జనసేన పార్టీ విడుదల చేసిన నియోజకవర్గ స్థాయి ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా మేడిశెట్టి రమణమూర్తి ఎన్నికైన విషయం తెలిసిందే.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.