శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వార్డుల రిజర్వేషన్ విడుదల కావడంతో ఆశావాదులు అభ్యర్థుల కోసం పోటీపడుతున్నారు. 4వ వార్డ్ ఎస్సీ మహిళకు కేటాయించడంతో.. స్థానిక జనసేన నాయకుడు తుంగాన దేవరాజ్ భార్య తుంగాన దివ్య కౌన్సిలర్ గా పోటీ చేయనుంది. ఇప్పటికే.. భార్య భర్తలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు స్వస్తి పలికి స్థానిక ప్రజల సమస్యల కోసం గడిచిన మూడు సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున నిలబడి తమ వంతు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే..
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.