శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే శిరీష ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలువురు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి వివరించారు. పలు సమస్యలపై అధికారులతో ఆమె మాట్లాడి తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచినీటి కుళాయి, మురుగు కాలువలు, ఉద్యోగ అవకాశాలు, గిరిజన ప్రాంతాలలో సెల్ సిగ్నల్ తదితర మొత్తం 36 వినతులు అందాయి.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.