రాష్ట్రవ్యాప్తంగా రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో.. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఆశావాదులు ఇప్పటికే తమ తమ వార్డుల పరిధిలో వ్యూహాలు రచిస్తున్నారు. 10వ వార్డ్ పై జనసేన అభ్యర్థి పెద్దగోపి శివకుమార్ గురిపెట్టారు. ప్రత్యర్థి ఎవరైనా..? ఇప్పటికే వార్డు ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడుతూ.. వారికి అండగా నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేసిన అనుభవంతో పాటూ... ఇటీవల జనసేన పార్టీ విడుదల చేసిన నియోజకవర్గ స్థాయి ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా శివకుమార్ ఎన్నికైన విషయం తెలిసిందే.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.