శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురంలో గురువారం నిర్వహించిన పేదల సేవలో (2.0) కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఓ మహిళ మాట్లాడుతూ...
సీఎం చంద్రబాబు ఆలోచన, పలాస నియోజకవర్గంలో గౌతు కుటుంబ ఆచరణ గూర్చి ఆమె వివరించారు.
ఆ రోజుల్లో మా గ్రామంలో ముగ్గురు వ్యక్తులకు మాత్రమే కేవలం 30 రూపాయలు పింఛన్ మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ అందించే వారిని గుర్తు చేశారు.
పూట గడపడమే కష్టంగా ఉన్న రోజుల్లో... శివాజీ గారు వీధుల్లో పర్యటించి.. మహిళలతో మాట్లాడి, మహిళలు ఇళ్లల్లో కాకుండా.. ప్రతి మహిళ బ్యాంక్ మెట్లు ఎక్కితే అభివృద్ధి సాధ్యమని అందుకు గ్రూపు(సంఘాలు)గా ఏర్పడాలని ఆయన సూచన మేరకు నేడు స్వయం ఉపాధి పొందుతున్నామని తెలిపారు.
నెలకు ₹ 30 పొదుపు కట్టేందుకు, ఒక్కో మహిళకు ₹ 1000 రుణాలు ఇచ్చారని, కొంతకాలానికి ₹ 2000, మరికొంత కాలానికి ₹ 5000 చొప్పున రుణాలతో స్వయం ఉపాధి పొందే వాళ్ళమని తెలిపారు.
కానీ నేడు 15 మంది సభ్యులతో కలిగిన స్వయం శక్తి సంఘానికి బ్యాంకులో సుమారు రూ. 20 లక్షల వరకు రుణాలు పొందుతున్నామని ఆమె తెలిపారు.
గ్రామాల్లో 20 ఎకరాలు ఉన్న భూస్వామికి రూ. 5 లక్షల లోను ఇచ్చేందుకు బ్యాంకు వారు ఈరోజు ముందుకు రావడంలేదని, కానీ కేవలం నిరుపేద మహిళలతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.
నిరక్షరాలైన ఆ వృద్ధురాలి కపటం లేని అమాయకపు మాటలకు వేదికపై ఉన్న ఎమ్మెల్యే శిరీషతో పాటు అధికారులు మంత్రముగ్ధులైనారు.