శ్రీకాకుళం జిల్లాలో ఒక నగరపాలక సంస్థతో పాటు మూడు పురపాలక సంఘాల రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో మహిళకు కేటాయించగా... ఆమదాలవలస, పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘాలలో జనరల్ మహిళకు అవకాశం కలిగింది. ఇచ్చాపురం పురపాలక సంఘానికి బీసీలకు అవకాశం కల్పిస్తూ.. అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.