శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పెద్ద అంగవానిపేట గ్రామానికి చెందిన యువకుడు అంగ ధర్మారావు (18) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో తన కాలును వైద్యులు తొలగించారు. విషయం తెలుసుకున్న కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ బ్రదర్స్ బాధిత యువకుడిని శనివారం పరామర్శించి రూ. 40 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంగపుత్రులకు ఎంతటి కష్టమొచ్చినా అండగా మేము ఉంటామని విజయ్ బ్రదర్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలపాడు మాజీ సర్పంచ్ షణ్ముఖరావు, కొత్తపేట మాజీ సర్పంచ్ పాపారావు, కంబాల రాయుడిపేట మాజీ సర్పంచులు చిరంజీవి, కోటేశ్వరరావు తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.