శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి మొగిలిపాడులో అమానుష ఘటన చోటుచేసుకుంది. గురువారం స్థానిక మురుగు కాలువలో మగ శిశువు మృత పిండాన్ని స్థానికులు చూసి ఆందోళన చెందుతూ... పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత శిశువును స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఏ తల్లి కన్న బిడ్డో ఇలా మురుగు కాలువలో పడేయడంతో స్థానికులు కంట తడి పెట్టుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.