Skip to main content

పూండిలో కలకలం రేపిన బంగారం చోరీ...

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.

High Viewed News

పలాసలో రైలు నుంచి జారిపడిన మహిళకు తీవ్ర గాయాలు

కలకత్తా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) రైలులో ప్రయాణం చేస్తూ... ఆదివారం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ జారిపడింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సత్యం & వెంకట్రావు ఘటన స్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స అందించి, వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ అస్సాం కు చెందిన అజ్వినా ఖాన్ గా గుర్తించి కేసు నమోదు చేసిన పలాస జిఆర్పి పోలీసులు.

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పలాస ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే శిరీష

పలాస సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాజరు పట్టిని పరిశీలించి డ్యూటీలో ఉన్న డాక్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సమయపాలన పాటించి వచ్చిన రోగులకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఇటీవల పలువురు వైద్యులపై రోగుల నుంచి ఫిర్యాదులు అందాయని అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

SIR విధులకు అదనపు వేతనం ఇవ్వాలని వినతి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు అదనపు గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావుకు ఆదివారం కంప్యూటర్ ఆపరేటర్లు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. SIR విధుల్లో భాగంగా అదనపు పనిభారం, సాంకేతిక మరియు ఇతర కార్యనిర్వహణ సమస్యలు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. అదనంగా నిర్వహిస్తున్న విధులను పరిగణనలోకి తీసుకుని అదనపు గౌరవ వేతనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు సానుకూలంగా స్పందిస్తూ... తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సిమ్మన్న, హరి, కోదండ, సుధాకర్ తదితర ఎన్నికల కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.