మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ విచారణ రేపటికి వాయిదా వేస్తూ... సోంపేట ఆరవ జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. జూలై 10 తేదీన కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో సాక్షాధారాలు తారుమారు చేశారని అభియోగంతో జులై 22న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు నేటితో 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో రిమాండ్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.