శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. మంగళవారం కూటమి నాయకులు, టిడిపి శ్రేణులతో స్థానిక టిడిపి కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సమన్వయం, ప్రజలతో మరింత మమేకమై పనిచేయాలని ఆమె ఆదేశించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.