మాజీ మంత్రి అప్పలరాజును నాలుగు రోజులు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ... నేడు పలాస జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు సోంపేట ఆరవ అదనపు జిల్లా కోర్టులో మాజీ మంత్రి అప్పలరాజుకు బెయిల్ పిటిషన్ ను ఆయన తరపు న్యాయవాది వేశారు. ఇది ఇలా ఉండగా... జూలై 10వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో సాక్షాధారాలు తారుమారు చేశారని అభియోగంతో జూలై 22వ తేదీన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.