శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు జంక్షన్ వద్ద పోలీసులు గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా... తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 3.85 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిస్సా రాష్ట్రం గుణుపూర్ నుంచి తమిళనాడు రైలు మార్గంలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. పట్టుబడినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.