జిల్లా స్థాయి యోగ పోటీల్లో సత్తా చాటిన సాయి జగదీశ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 6వ తేదీన నిర్వహించిన జిల్లా స్థాయి యోగ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ యోగ పోటీల్లో సాయి జగదీశ్ పాల్గొననున్నారు. జిల్లా స్థాయిలో సాధించిన విజయాన్ని రాష్ట్ర స్థాయిలోనూ కొనసాగించి ప్రతిభ కనబరచాలని పలువురు క్రీడాకారులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాయి జగదీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.