విజయవాడ లో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా ఆయన 3వ తరం వారసురాలు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సామాజిక మార్పు కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి లచ్చన్న అని ఆయన అందించిన సేవలకు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు తో పాటు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.