శ్రీకాకుళం జిల్లా మందస మండలం గిరిజన ప్రాంతమైన పెడంగో గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు పాతకోట జ్వర(45), సుమాంద్రి(43) మృతి చెందగా.. మరో నలుగురు మహిళలు గాయాల పాలయ్యారు. మహిళలంతా వ్యవసాయ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన బుయ పూర్ణి(48), కుమార్ నీలావతి(38), కొత్త సుస్మిత(32), మజ్జి దేవిక(34) లను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.