శ్రీకాకుళం జిల్లా కంచిలి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఖుర్దారోడ్ వెళ్తున్న ఇండియన్ ఆయిల్ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి వరద కాలువలోకి జారుకొని ఇరుక్కుపోయింది.విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.