చెన్నైలో జరిగిన అండర్ - 16 యోగాసన ఛాంపియన్షిప్ పోటీల్లో ఇచ్చాపురం పట్టణానికి చెందిన విద్యార్థి పాలేపు సాయి జగదీష్ నాలుగు పతకాలను కైవసం చేసుకున్నాడు. ట్విస్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం, ఫార్వర్డ్ బెండింగ్‌లో రజత పతకం, స్టాండింగ్‌లో రజత పతకం, బ్యాక్‌వర్డ్ బెండింగ్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పట్టణవాసులు అభినందించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.