శ్రీకాకుళం జిల్లా సోంపేటలో సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతి సందర్భంగా.. శ్రీ చైతన్య దీపిక ఆధ్వర్యంలో గీత కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ఓ నిరుపేద గీత కార్మిక కుటుంబంలో జన్మించిన డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా యువత అడుగులు వేయాలని కోరారు. అనంతరం పలువురు గీత కార్మికులకు ఘనంగా సన్మానించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.