నెల్లూరు జిల్లా క్యారమ్ సంఘ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి క్యారమ్ పోటీల్లో శ్రీకాకుళం (D), కవిటి (M), జగతి గ్రామానికి చెందిన ఎల్ హరిప్రియ ప్రథమ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు నగదు బహుమతితో పాటు ట్రోపీను అందించారు. హరిప్రియ ఇదివరకే జాతీయస్థాయిలో క్యారమ్ పోటీల్లో పాల్గొని ఇప్పటికే పలు పథకాలు సాధించిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు హరిప్రియకు అభినందించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.