శ్రీకాకుళం....
శ్రీశయన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ఏకీభావ తీర్మానంతో ప్రశాంతంగా ముగిశాయి. సుమారు 75 గ్రామాల పరిధిలోని కుల పెద్దల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలకు కుల రాజు మడ్డి కాళిదాసు సతీమణి చిట్టమ్మ అధ్యక్షత వహించారు. సందర్భంగా సంఘం నూతన అధ్యక్షుడిగా బింగి తాతయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఆనింగి చంద్రశేఖర్ (రాజు), కోశాధికారిగా బత్తిని తారకేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా రెల్ల జయరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతన కమిటీ ఎన్నికలు సుమారు 75 గ్రామాల కుల పెద్దల ఏకాభిప్రాయం, ఆమోదంతో జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని, సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా.. కవిటి మండలం పొందూరుపుట్టుగ గ్రామంలో ఆయనకు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.