శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు(M) పెద్దబొడ్డపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నార. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు.
ప్రతి నెలా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.