శ్రీకాకుళం జిల్లా పలాస ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్దాన ప్రజలు అందుకు సహకరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మందస మండలం బిడిమి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో స్థానిక యువకుల భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలని, నిర్వాసితులకు తగిన నష్టపరిహారం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.