శ్రీకాకుళం జిల్లా మండలం తర్లాకోటలో గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష "వికసిత్ భారత్ - జి రామ్ జి" పథకాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం చెరువు గట్టుపై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉపాధి రోజులు 100 నుంచి 125 రోజులకు పెంచుతూ.. రోజువారి వేతనం రూ. 312 చెల్లిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పి టి పి సి చైర్మన్ వజ్జ బాబురావు, విఠల్, సంతోష్ నాయుడు, మున్నా, కూర్మారావ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.