Skip to main content

మృతుని కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి శ్రీనివాస్

దానయ్య కుటుంబ పరిస్థితి హృదయ విదారకం.

- ప్రమాద పరిస్థితిని తారుమారు చేసిన మాజీ మంత్రి అప్పలరాజు పై చర్యలకు ఆదేశం 

- నీతి మాటలు వల్లించడంలో మంత్రి అప్పలరాజు ఘనుడు 

- డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ది 

- పార్టీ తరఫున పది లక్షల రూపాయల నష్ట పరిహారం 

- దానయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండ 

- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గౌతు శిరీష వెల్లడి


శ్రీకాకుళం, జులై 13,

ఇటీవల మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబ పరిస్థితి చూస్తే హృదయ విదారకంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి, శ్రీకాకుళం ఇన్చార్జి మంత్రివర్యులు కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తో కలిసి దానయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం  మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... మృతుని (దానయ్య) కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున పది లక్షల రూపాయలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు చేసిన ప్రమాదాన్ని తారుమారు చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దారుణమన్నారు. మాజీ మంత్రి అప్పలరాజుపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలను రాజకీయంగా మాట్లాడే అప్పలరాజు సొంత కుమారుడు చేసిన తప్పును కప్పిపుచ్చటానికి ప్రయత్నం చేయటం ఆక్షేపించదగిన విషయం కాదన్నారు. నీతి మాటలు వల్లించే అప్పలరాజు రోడ్డు ప్రమాద సంఘటనను తప్పుదోవ పట్టించటం బాధాకరమైన విషయం అన్నారు. వైసిపి నాయకుల పరిస్థితిని గమనించినట్లయితే గతంలో డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడిన చరిత్ర వైసీపీకి ఉందన్నారు. ఇద్దరు చిన్నపిల్లలతో, భార్య, వయోభారంతో ఉన్న తల్లి గొర్రెల కాపరి దానయ్య ఆకస్మిక మృతితో వారి కుటుంబం అనాధలా మారిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దానయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించమని పంపించడం జరిగిందన్నారు. ప్రమాదం చేసిన మంత్రి కుమారుడుని మార్చి వేరొక వ్యక్తిని కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన మంత్రి తప్పిదాన్ని పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. ఈ రోడ్డు ప్రమాద సంఘటనపై ఇప్పటికే పోలీసు వ్యవస్థ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంత్రి గారితో పాటు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.


.....................................


జారీ: రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రివ‌ర్యులు కార్యాల‌యం

High Viewed News

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉద్దానంలో దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరం.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే  ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?

ఒడిశా తీరంలో నౌక మునక.. 24 మంది గల్లంతు?

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయింది. పనామా జెండాతో వెళ్తున్న కార్గో షిప్లో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా నుంచి ఐరన్ ఓర్ను సింగపూర్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.